Post by Lopintisri on Jul 31, 2014 22:02:19 GMT 5.5
పరమాత్మ విశ్వకర్మ
ఋగ్వేద దశమ మణ్డల సూక్త ౮౧ । ౧౦.౮౧
సస్వర
వి॒శ్వత॑శ్చక్షురు॒త వి॒శ్వతో॑ముఖో వి॒శ్వతో॑బాహురు॒త వి॒శ్వత॑స్పాత్ ।
సం బా॒హుభ్యాం॒ ధమ॑తి॒ సం పత॑త్రై॒ర్ద్యావా॒భూమీ॑ జ॒నయ॑న్దే॒వ ఏకః॑ ॥ ౩॥
తా॥ ఆ పరమాత్మ అంతటా కన్నులు కలవాడు, అన్ని వైపులా పాదములు కలవాడు, అంతటా బాహువులును, అంతటా నిండియున్న స్వయం ప్రకాశుడునూ, అద్వితీయుడును అయిన ఆ విశ్వబ్రహ్మ ఒక్కడే స్వర్గ, మార్త్యలోకములను సృజించుచూ ధర్మాధర్మములనేడి బాహువులచే పతనశీలములకు ఉపాదానకారణములచే జగత్తును స్వాదీనము చేసికొనుచున్నాడు.
...ఇది ఋగ్వేదము నందున్నది
- - - -ఈ భాష్యము వ్రాసినది సాయణాచార్యులు
ఈ సృష్టి విశ్వకర్మ పరమాత్మునిచే సృష్టింపబడినది, పరమాత్మ విశ్వకర్మ (విరాట్ విశ్వకర్మ)చే సృష్టింపబడిన నిరుక్త విశ్వకర్మ(భౌవన విశ్వకర్మ)చే పాలింపబడు హిరణ్యగర్భము నందు సకల దేవతల సృష్టి మరియు సమస్తలోకాలు ప్రాప్తింపబడుచున్నవి.
తరువాతి గతి ప్రపంచము సృష్ఠింపబడినప్పుడు మొట్టమొదటి ప్రభువై పుట్టిన భౌవనాధిపతి భౌవనవిశ్వకర్మకు కుమరుఁడైన భౌవనపుత్ర విశ్వకర్మ. దేవతా, మానవ జగతికి మొట్టమొదటి గురువై సకల శాస్త్రాలు ఋషులకందించిన రీతిఇది.

శ్లో॥ నభూమి నజలం చైవ నతేజో నచ వాయవ:
నచబ్రహ్మ నచవిష్ణు నచ రుద్రస్య తారకః
సర్వశూన్య నిరాలంబో స్వయంభూ విశ్వకర్మణ:
-మూల స్తంభ పురాణం
(తా|| భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను. భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ తనంతట తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు.)
గమనిక: పంచభూతములు పుట్టక ముందే విశ్వకర్మ ఉన్నటైతే అతని ఆ స్వరూపము ఎలా వచ్చింది ?,
సమాధానం : మనము మననము చేసుకొనేందుకు, గుర్తుకు ఆ విధంగా విగ్రహాన్ని రూపొందిచారు.
శ్లో॥ పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః
అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః
తా॥ తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖములో సనాతన ఋషి, పశ్చిమ ముఖములో అహభూన ఋషి, ఉత్తర ముఖములో బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖములో సుపర్ణ ఋషులుద్బవించిరి.విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతములో సానగబ్రహ్మర్షి మకుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవములో సనాతన మహర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ మహర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషములో ప్రత్న మహర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానములో సువర్ణ మహర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినై.
ఋగ్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్టను గుర్తిస్తారు.
మాగశుద్ధ త్రయొదశి నాడు పరమాత్మ విశ్వకర్మను పూజిస్తారు.
ఇట్లు
మీ లోపింటిశ్రీ