Post by Lopintisri on May 8, 2020 22:20:13 GMT 5.5
భౌవనపుత్ర విశ్వకర్మ
ఏనుగు వాహనంగా కలవాడు భౌవనపుత్ర విశ్వకర్మ (ఏనుగు నల్లదా తెల్లదా అనేది ముఖ్యము కాదు)
హిరణ్యగర్భమును పాలించు భౌవన ప్రభువు కుమారుడు భౌవనపుత్ర విశ్వకర్మ.
భౌవన పుత్ర విశ్వకర్మావతారము:-
శ్లో॥ ఏతేనహవా ఐంద్రేణ మహీభిషేకేణ కశ్యపో విశ్వకర్మణం భౌవన
మభిషిషేచ। తస్మాదు విశ్వకర్మా భౌవనః సమస్తం సర్వతః
పృధ్వివీం జయ ౯ పరియాశ్వై రుచమేద్వైరీజే ॥
హిరణ్యగర్బము పాలించు భౌవన ప్రభువు కుమారుడు భౌవన పుత్ర విశ్వకర్మ ధరణి యందు జన్మించి కశ్యపుడు(భౌవనుడు) సర్వోత్కృష్టమైన సార్వభౌమ పట్టాభిషిక్తుండచేసేను. భౌవన పుత్ర విశ్వకర్మ సామ్రాజ్యము (వేదపురము) భూప్రపంచమెలాగుననగా, ఇది మొదలు భూప్రభువు ఒక్కడేనే చతుస్సముద్ర ముద్రితమై, భూమండంలం మంతయు పరిపాలన చేయుచున్నవాడు.
ఒక శిరస్సు నాలుగు హస్తములు మరియు ఏనుగు వాహనంగా కలవాడు భౌవనపుత్ర విశ్వకర్మ. జనులకు మొట్ట మొదటి గురువులైయిన భౌవన పుత్ర విశ్వకర్మ యోక్క పూజ ప్రతి సంవత్సరం చైత్రశుక్ల పంచమి నాడు పూజ జరుపుకొందురు. ముఖ్యంగా కర్మాగారాముల యందు మరియు పారిశ్రామిక ప్రాంతాముల యందు ఈ పూజ తప్పక జరుపుకొందురు. వారి పనిముట్లను భౌవన పుత్ర విశ్వకర్మ ముందుంచి పూజించెదరు. భౌవన పుత్ర విశ్వకర్మను పూజించువారు విశిష్టజ్ఞానమును పొందుదురు
కశ్యపమహాఋషి గూర్చి హరిదత్తాచార్యుల బాష్యం : కశ్యపోయాస్వింద్రః కశ్యప ఇ త్యాదిత్య స్వాభిదానం, పశ్యతి సర్వమితి పశ్యః, పశ్య ఏవపశ్యః తత్రాద్యంత విపరయ్యయెణ కశ్యపో భవతి. కించ దృశ్యతే చారణ్యకేచ కశ్యపః పశ్యకో భవతి యత్సర్వం పరిపశ్యతీతి.
సర్వమూ చూచువాడు, సర్వాంతర్యామి, పశ్యుడు, ఆద్యంతవిపర్యయము వలన కశ్యపుడైనాడని, అతడే పరమాత్మని యజురారణ్యకము (యజుర్వేదం)నందుండి. గశ్యపో విరాట్స్వరూప మని స్కందపురాణం లో నాల్గవ అద్యాయం చేప్పబడుచున్నది. అంటే కశ్యపమహర్షే ఆ విరాఠ్ విశ్వకర్మ. ఈ భౌవన పుత్రవిశ్వకర్మ జగత్పాలన కర్త, యజ్ఞకర్త, అశేషసృష్టికర్త:
శ్లో॥ భువనో నామ యోదేవో విశ్వకర్మాథ తత్సుతః
ప్రసిద్ధో యస్స శాస్ర్తేషు భౌవనః సురవర్ధకీ
విశ్వకర్మా స్వయం తత్ర చిత్రా ౯ లోకా ౯ వినిర్మమే
ప్రాసాదాశ్చ విమానాని వాప్యుద్యానా న్యలంకృతిః
వస్త్ర వాద్యాది వస్తూని విచిత్రాణీ పృథక్పృథక్॥
తా॥ భువనుడను పేరుగల దేవునికి శాస్త్ర ప్రసిద్ధుడగు విశ్వకర్మ అని పిలువబడే కుమారుడు గలడు, భౌవన దేవ దేవుడు, స్వయముగా చిత్రమైన లోకములను సృష్టించినవాని కుమారుడు భౌవనపుత్ర విశ్వకర్మ, ప్రాసాదములు, విమానములు, బావులు, ధాన్యములు, భూషణములు, విచిత్రములగు వస్త్రములు, వాద్యములు, అలాంటి వస్తువులు అనేకమైనవి సృష్టించేను అటులనే పరమేశ్వరుని యోక్క అవతారమరూపమై, భౌవన పుత్రవిశ్వకర్మ లోకపాలన, లోక సృష్టి కర్తవ్యముల కొరకు అవతరించారని తెలియుచున్నది.
శ్లో॥ సమస్త భువనాధారం, మత్వా బ్రహ్మండ మధ్యతః
విశ్వకర్మ మహామేరుం, విశ్వశంకుం నిధాయ సః
పద్మకోశంనిభం మేరుం, కృత్వా తస్మి న్మహూన్నాతే,
అసృజ ద్విశ్వకర్మాయం, భువనాని చతుర్ధశ.
తా॥ ఆ విశ్వకర్మ గొప్పదైన మేరు పర్వతము(లాంటి) ఎల్లలోకములకు ఆధరమైన విశ్వశంకువుగా భావింపబడిన బ్రహ్మండమునకు నడుమ తామర మొగ్గవంటి మేరువును ఉంచి పదునాలుగు భువనములను సృష్టించినాడు. ఆలాంటి ఒక భువనమునకు ప్రభువు భౌవన విశ్వకర్మ అని తెలియుచున్నది. భౌవన పుత్ర విశ్వకర్మ, శిల్పి విశ్వకర్మ తపఃశక్తితో సాక్షాత్కరింపబడి తన సర్వశక్తులను దేవశిల్పివిశ్వకర్మకొసంగి భవిష్యమానవులకు ఉద్దరింప మనెను. అటు పిమ్మట మానవులందరూ దేవశిల్పివిశ్వకర్మను స్మరించుచూ తమతమ నైపుణ్యమును చూపుతున్నవారై జీవనమును సాగించుచున్నారు.
పరబ్రహ్మ విశ్వకర్మని సాక్షాత్ కారం చేసుకున్నా మొట్ట మొదటి గురువులైయిన భౌవన పుత్ర విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం చైత్రశుక్ల పంచమి నాడు పూజ జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.
మీ లోపింటిశ్రీ